కెసిఆర్‌పై నిప్పులు గక్కిన మందకృష్ణ మాదిగ

కేంద్రంతో కెసిఆర్‌కు లాలూచి ఉందనడానికి ఆయన పలుమార్లు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లే నిదర్శనం అన్నారు. ఎపి భవనంలో దళిత వ్యక్తి అయిన చందరరావుపై చేయి చేసుకున్న హరీష్ రావు దాడికి నిరసనగా శని, ఆదివారం రెండు రోజులపాటు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టిఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసమే షో చేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ అవకాశ వాద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శ్రీకృష్ణ కమిటీని మొదట్లో ఎందుకు ఆమోదించారని ప్రశ్నించారు. కెసిఆర్‌కు దమ్ముంటే వ్యాపారాలు ఎవరితో చేస్తున్నారో బయట పెట్టాలని ప్రశ్నించారు. దళితుడిపై దాడిని కప్పి పుచ్చుకోవడానికే తెలంగాణ జెఏసి బందుకు పిలుపునిచ్చిందన్నారు.
బందుకు ఐకాస చెబుతున్న రెండు కారణాలపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. బందులో సైతం అగ్రవర్ణ దురహంకారం చూపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం 600 మంది విద్యార్థులు చనిపోతే కేవలం రెడ్డి కులానికి సంబంధించిన వారు చనిపోయినప్పుడు మాత్రమే బందుకు పిలుపు ఇవ్వడం వెనుక టిజెఏసి చైర్మన్ కోదండరామ్ రెడ్డి కులస్తుడు కాబట్టి అని చెప్పారు. ఢిల్లీలో దళితుడిపై చేయి చేసుకున్న హరీష్ రావును ఢిల్లీ పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడి ద్వారా దొరల దురహంకారం మరోసారి చూపించారని అన్నారు.












Click it and Unblock the Notifications