హైదరాబాద్: రాజకీయ దురుద్దేశంతోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్, టీడీపీ నేతలు కేసులు వేశారని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సీబీఐ విచారణకు భయపడి జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించలేదని, ఆ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే కోర్టుకు వెళ్లారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ తట్టుకోలేకనే కాంగ్రెస్, టీడీపీలు అదేపనిగా బురద జల్లుతున్నాయని ఆయన మండిపడ్డారు. అదే సమయంలో ఆయన రామోజీరావును ఆడిపోసుకున్నారు.
రూ.1800 కోట్ల నష్టాల్లో ఉన్న రామోజీరావు వ్యాపారాల్లో నిమేష్ కంపానీ రూ.2,500 కోట్లు ఎలా పెట్టుబడి పెట్టారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మతలబు వెనక విచారణకు రామోజీ ఎందుకు సిద్ధపడరన్నారు. వైఎస్ జగన్ విజయవంతమైన వ్యాపారవేత్త కాబట్టే ఆయన కంపెనీల్లో ఇతర సంస్థలు పెట్టుబడులు పెడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తమ నాయకుడు వైయస్ జగన్‌పై సిబిఐ ప్రాథమిక దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఆయన రామోజీరావుపై పడ్డారు.