డోన్ అసెంబ్లీ సీటు అభ్యర్థిని ప్రకటించిన జగన్

డోన్ నియోజకవర్గంలో ఓదార్పు యాత్రకు వైయస్ జగన్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. డోన్ నియోజకవర్గం నుంచి కోట్ల విజయభాస్కర రెడ్డి కోడలు, కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భార్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డోన్‌లో వైయస్సార్ విగ్రహ ప్రతిష్టాపనను అధికారులు అడ్డుకున్నారు. విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతి లేదని అందుకు వారు నిరాకరించారు. దీంతో ఆగ్రహించి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి సవాల్ విసిరే ఉద్దేశంతో డోన్ నియోజకవర్గానికి జగన్ అభ్యర్థిని ప్రకటించినట్లు భావిస్తున్నారు. బేతంచర్లకు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవారు.
తాము అధికారంలోకి వస్తే రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని ఆయన విమర్శించారు. తననూ తన తల్లినీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించామని ఆయన అన్నారు. త్వరలో వైయస్సార్ స్వర్ణయుగం వస్తుందని ఆయన అన్నారు. మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని ఆయన చెప్పారు.