ప్రధానిని మళ్లీ లాగిన రాజా, సాక్షిగా చిదంబరం

టెలికమ్ కంపెనీలకు వాటా కల్పించే విషయం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరానికి తెలుసునని ఆయన సోమవారం అన్నారు. మీడియానే ఈ విషయంలో ఆయన తప్పు పట్టారు. ఆరు నెలలుగా జైలులో ఉన్న రాజా - తనను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రత్యేక న్యాయమూర్తి ఒపి సైనీ ముందు రాజా తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ తన వాదనలు వినిపించారు.
2జి స్పెక్ట్రమ్ అంశమంతా రాజకీయ క్రీడ అని, రాజాకు రక్షణ కల్పించాలని రాజా తరఫు న్యాయవాది అన్నారు. తన అధికారిక విధుల్లో భాగంగానే రాజా అన్ని పనులు చేశారని ఆయన వాదించారు. ఈ కేసులో జీరో నష్టం ఉందని పార్లమెంటు ప్రజలకు తెలిపిందని, దానిపై భారత ప్రభుత్వం ఓ వైఖరి తీసుకుందని, అందుకని రాజాకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications