తప్పు పట్టిన లోకాయుక్త, యడ్యూరప్పకు పదవీ గండం

జెడి (ఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని, మంత్రులు గాలి సోదరులు, పార్లమెంటు సభ్యుడు అనిల్ కుమార్‌ను సంతోష్ హెగ్డే తప్పు పట్టారు. వారికి అక్రమ మైనింగులో పాత్ర ఉందని ఆరోపించారు. అక్రమ మైనింగ్ అనుమతులు పొందిన కంపెనీలు యడ్యూరప్ప కుమారుల కంపెనీల్లోకి నిధులు మళ్లించారని ఆయన చెప్పారు. అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వానికి 16 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. తన నివేదికపై చర్యలు తీసుకుంటారనే నమ్మకం తనకు లేదని సంతోష్ హెగ్డే అన్నారు. గతంలో ఇచ్చిన నివేదికను కూడా పక్కన పెట్టేశారని ఆయన అన్నారు. లోకాయుక్త ఉద్యోగుల ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
లోకాయుక్త నివేదిక సమర్పించిన నేపథ్యంలో యడ్యూరప్పకు పదవీ గండం తప్పేట్లు లేదు. యడ్యూరప్ప వారసుడి కోసం బిజెపి అధిష్టానం అన్వేషన సాగిస్తోంది. రేపటిలోగా యడ్యూరప్ప రాజీనామా చేసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం ఉదయం ఆయన మీడియా ప్రతినిధులకు తిరుపతి లడ్డూలు పంచిపెట్టారు. మంగళవారం రాత్రి ఆయన తిరుపతిలో గడిపారు. తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. యడ్యూరప్ప సూచించిన నాయకుడికే ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications