తెలంగాణపై జగన్ స్పష్టం చేయాల్సిందే: లగడపాటి

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని, ఏకాభిప్రాయం సాధించకుండా రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని చెప్పిందని ఆయన అన్నారు. ఏకాభిప్రాయం వచ్చినా రాష్ట్రం ఏర్పాటు చేయాలనే నిబంధన లేదని, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. రెండు వారాల్లోగా కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు అన్నారని, ఈ రోజుతో రెండు వారాలు గడిచిపోయాయని, ఏ విధమైన నిర్ణయం రాలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు కూడా రాని బిజెపి, సిపిఐ జాతీయ పార్టీల పేరు మీద హడావిడి చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే ఆలోచన లేదని ఉప ప్రధానిగా ఉన్నప్పుడు బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. శాసనసభ తీర్మానం చేస్తేనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందని, శాసనసభ తీర్మానం చేసినా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఏమీ లేదని విదర్భ విషయంలో అద్వానీ చెప్పారని ఆయన అన్నారు. బిఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చెప్పారనేది కూడా అబద్ధమని ఆయన అన్నారు. తెలంగాణ, ఆంధ్ర విడిపోవచ్చునని నెహ్రూ చెప్పలేదని ఆయన అన్నారు. కట్టుకథలు, పిట్టకథలు చెబుతూ ఉద్వేగాలను రెచ్చగొడుతున్నారని, విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాదులో ఉన్న ఆస్తి కోసమే తాను సమైక్యాంధ్ర గురించి మాట్లాడుతున్నారని కెసిఆర్ భావిస్తే తన ఆస్తి అంతా రాసిస్తానని, అప్పుడు కెసిఆర్ సమైక్యాంధ్ర అంటారా అని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఆస్తి కోసం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications