అక్కినేని అన్నపూర్ణ స్టూడియోపై ఎగిరిపడ్డ గుత్తా

వారు కట్టించిన భవనాల కంటే వారికి ప్రభుత్వం కేటాయించిన తెలంగాణ భూములకే ఇప్పుడు ఎక్కువ ధర ఉందని అన్నారు. అయినా వాటిపై మేము ప్రశ్నించడం లేదన్నారు. సినీ ప్రముఖులు తమకు కేటాయించిన భూముల ప్రయోజనాన్ని దెబ్బ తీసి బార్లు, ఇతరత్రా వ్యవహారాలు నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఉన్న ఆంధ్రా వారికంటే అడ్డగుట్టలో నివసించే వారే ఎక్కువ ఉన్నారని అన్నారు. హైదరాబాదులోని ఖరీదైన భూముల్లో భవనాలు కట్టుకుని నివసిస్తున్నారని, వాటిని పెట్టుబడులు అని ఎలా అంటారని ఆయన అన్నారు. తాము హైదరాబాదులో పెట్టుబడులు పెట్టామని సీమాంధ్ర ప్రముఖులు చేస్తున్న వాదనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
సమైక్యవాదుల కుట్రలో సెటిలర్లు బలి పశువులు కావద్దని సూచించారు. తెలంగాణ ప్రజలకు విడిపోయే హక్కు ఉందన్నారు. సీమాంధ్ర నేతల అభిప్రాయాలతో తమకు సంబంధం లేదన్నారు. నాటి ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశంలో పార్టీలు అన్నీ తెలంగాణకు మద్దతు పలికాయని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక కూడా ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చునని, ఎవరి వ్యాపారాలను మేం అడ్డుకోమని చెప్పారు. బచావత్ అభిప్రాయం ప్రకారమే నదీజలాల పంపిణీ చేయాలని అన్నారు.












Click it and Unblock the Notifications