వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెన్షన్ పేరుతో చిరంజీవి విలీనసభ రద్దు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్:రాష్ట్రంలో తాజా పరిస్థితులో నేపథ్యంలో ప్రజారాజ్యం విలీన సభను చిరంజీవి రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో విలీన సభ వద్దని అనుకున్నామని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు ఘంటా శ్రీనివాస రావు చెప్పారు. ఆగస్టు నాలుగవ తేదీన చిరంజీవి ఢిల్లీ వెళ్లి అక్కడ లాంఛనంగా కాంగ్రెసు పార్టీలో చేరుతారు. కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల మధ్య అంతరం ఉందని ఆయన అన్నారు. ఆ అంతరాలను పూడ్చడానికి నియోజకవర్గ స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. విలీనసభను భారీగా రాష్ట్రంలో నిర్వహించాలని చిరంజీవి భావించారు. అయితే, అందుకు కాంగ్రెసు అధిష్టానం మొదటి నుంచి కూడా విముఖత ప్రదర్శిస్తూ వస్తోంది. చిరంజీవి నిర్ణయంతో కాంగ్రెసు అధిష్టానం అభిప్రాయమే నెగ్గినట్లయింది.

తన ప్రజారాజ్యం పార్టీకి చెందిన శాసనసభ్యులతో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం విలీన ప్రక్రియ వెనక్కి పోతుండడం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ ఊసు లేకపోవడం వంటి సమస్యలపై చిరంజీవి వారితో సమావేశమైనట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని భావించారు. అయితే, తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాల నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ ప్రక్రియ వెనక్కి వెళ్లింది.

కాగా, తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలపై తాము చిరంజీవితో చర్చించినట్లు శాసనసభ్యుడు ఘంటా శ్రీనివాస రావు సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. స్థానిక సమస్యలపై తాము ముఖ్యమంత్రికి వివరించాలని అనుకున్నామని, ఇంతకు ముందు ఇదే విషయంపై ముఖ్యమంత్రిని కలిశామని ఆయన చెప్పారు. అయితే ఆప్పుడు రాష్ట్రపతి పర్యటన వల్ల ముఖ్యమంత్రి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయారని, దాంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నామని, దానిపై సమావేశంలో చర్చించామని ఆయన వివరించారు.

English summary
Prajarajyam party president Chiranjeevi met his MLAs today to discuss on various issue in the eve merger ib Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X