తెలంగాణపై తేల్చితేనే హాజరవుతాం: ప్రధానితో టి-ఎంపీలు

కాగా తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పార్లమెంటుకు హాజరు కాలేమని ప్రధానికి వారు తేల్చి చెప్పారు. ప్రధాని సైతం సానుకూలంగానే స్పందించినట్లుగా తెలుస్తోంది. 14ఎఫ్‌పై ముఖ్యమంత్రి లేఖ అందగానే చర్యలు తీసుకుంటానని చెప్పారు. తెలంగాణ అంశాన్ని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ చూసుకుంటున్నారని ప్రధాని ఎంపీలకు చెప్పారు. దేశంలో అనేక సమస్యలు ఉన్న ఈ సమయంలో కేవలం ఒకే అంశంపై పట్టుబడటం సరికాదని ఎంపీలకు సూచించారు. మీరు రాజీనామా చేసిన పరిస్థితులు తెలుసునని ప్రధాని వారితో చెప్పారు. అంతా సవ్యంగానే జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పిఎంతో భేటీ అనంతరం ఎంపీలు మంద జగన్నాథం, రాజయ్యలు విలేకరులతో మాట్లాడారు.
14ఎఫ్, తెలంగాణపై ప్రధాని హామీ ఇచ్చారన్నారు. రాజీనామాల ప్రస్తావన రాలేదని చెప్పారు. తమ ప్రతిపాదనలకు పిఎం సానుకూలంగా స్పందించారన్నారు. స్పీకర్ మీరా కుమార్ నుండి తమకు ఎలాంటి లేఖలు అందలేదని చెప్పారు. కాగా తెలంగాణ అంశంపై తమ పార్టీ నేతల్లో ఏకాభిప్రాయానికి ప్రయత్నాలు చేస్తున్నానని గులాం నబీ ఆజాద్ అంతకుముందు విలేకరుల సమావేశంలో అన్నారు. త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications