వేగుంట మోహన్ ప్రసాద్ పరిస్దితి ఆందోళనకరం

ఆయన తొలి కవితా సంకలనం చితి- చింత. చివరి కవిత్వం నిషాదం. దీనికి తణికెళ్ల భరణి అవార్డు లభించింది. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ఆయన ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశారు. చివరి దశలో ఆయన కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం అనుసృజన (అనువాద) శాఖకు అధిపతిగా పనిచేశారు.
ఆయన ప్రముఖ రచనలు - రహస్తంత్రి, పునరపి మొదలైనవి. తెలుగు కవిత్వాన్ని ఆంగ్ల పాఠకులకు అందించిన ఘనత కూడా ఆయనకు దక్కుతుంది. పలువురు తెలుగు కవుల కవిత్వాన్ని ఆయన ఇంగ్లీషులోకి అనువదించారు. అంతేకాకుండా దేశదేశాల కవులను కరచాలనం పేరుతో తెలుగు పాఠకులకు అందించారు.












Click it and Unblock the Notifications