సత్య సాయి సెంట్రల్ ట్రస్టుకు మరో నోటీసు?

వాటిని తీసుకున్న ప్రభుత్వం ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) నరసింహమూర్తి ద్వారా పరిశీలన చేయించింది. ప్రభుత్వం అడిగిన విధంగా ట్రస్టు వివరణ లేదని సీఏ వివరించారు. దాతల పేర్లు, వారి చిరునామాలు, దేశ విదేశాల్లో అనుబంధ సంస్థలు ఇతర వివరాలు లేవని పేర్కొన్నారు. అంతేగాక ట్రస్టు అనుబంధ సంస్థలు 154 దేశాల్లో ఉండగా ప్రభుత్వానికి పంపిన ఫైళ్లలో కేవలం పది సంస్థల వివరాలు మాత్రమే పుస్తకాల రూపంలో అందజేశారన్నారు.
లోపాలన్నింటినీ గుర్తించిన సీఏ మూర్తి - కొంత సమాచారమే ఇచ్చారని ప్రభుత్వానికిచ్చిన నివేదికలో వివరించారు. ఈ నివేదికను దేవాదాయ, ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి రమణాచారి ముఖ్యమంత్రికి అందజేశారు. నివేదిక పరిశీలించిన సీఎం ఇంతకు ముందు అధికారులు అడిగిన వివరాలన్నింటినీ పూర్తిగా ఇవ్వకపోతే ప్రభుత్వానికి అవసరమైన సమాచారం అడుగుతూ మరో నోటీసు ఇవ్వాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications