వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమ్మెకు దిగే తెలంగాణ ఉద్యోగులకు ఉద్వాసన?

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్: సమ్మెకు దిగే ప్రభుత్వ ఉద్యోగులపై ఉక్కు పాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అస్త్రాలు సిద్ధం చేసింది. ఇప్పటికే కొన్ని శాఖల్లో ఎస్మాను ప్రయోగించడానికి వీలుగా వాటిని అత్యవసర సర్వీసుల కిందికి తెచ్చిన ప్రభుత్వం తాజాగా ఉద్యోగులపై ఆర్టికల్ 311ను ప్రయోగించాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆర్టికల్ ద్వారా సమ్మె చేసే ఉద్యోగులను తొలగించడానికి వీలవుతుంది. తెలంగాణ ఉద్యోగుల సమ్మెను దెబ్బ తీయడానికి అవసరమైతే ఈ ఆర్టికల్‌ను ప్రయోగించాలని ప్రభుత్వం అనుకుంటోంది.

ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సమ్మెకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8వ తేదీ నుంచి తెలంగాణకు చెందిన ప్రభుత్వోద్యోగులు సకల జనుల సమ్మెలో పాల్గొనడానికి నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేయడాన్ని సీమాంధ్ర నాయకులు వ్యతిరేకిస్తుండగా, తెలంగాణ రాజకీయ నేతలు సమర్థిస్తున్నారు. వారికి కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు వంటి నాయకుల మద్దతు కూడా ఉంది.

తెలంగాణ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఓ శాఖలో ఇప్పటికే ఎస్మాస్త్రం ప్రయోగించింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి చెందిన ఆర్థిక శాఖపై ప్రభుత్వం ఎస్మాస్త్రం ప్రయోగించింది. పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ, ఆర్థిక శాఖ తదితర శాఖల్లో సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా శాఖలను అత్యవసర సేవల క్రిందకు తీసుకు వచ్చిన నేపథ్యంలో ఆ శాఖల్లో ఎవరూ సమ్మెలు చేయడానికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఈ చట్టం తీసుకు వచ్చింది.

English summary

 CM Kirankumar reddy government may use article 311 on Telangana employes strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X