వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా తెలుగు తల్లి పాట గొడవ: హరీష్‌పై ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
విశాఖపట్నం: పాఠ్య పుస్తకాల్లోని మా తెలుగు తల్లి పాటపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యపై దుమారం చెలరేగుతోంది. హరీష్ రావుపై సీమాంధ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లోని మా తెలుగు తల్లి పాట అచ్చయిన పేజీని చించేయాలని హరీష్ రావు ఇటీవల హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగిన తెలంగాణ ఉపాధ్యాయుల ధర్నా కార్యక్రమంలో పిలుపునిచ్చారు. చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రాపు ఆ విధమైన ప్రకటన చేయడం సరి కాదని సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకుడు కిషోర్ విశాఖపట్నంలో అన్నారు. హరీష్ రావుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలుగు తల్లి విగ్రహాన్ని అవమానించిన హరీష్ రావు ఇప్పుడు మా తెలుగు తల్లి పాటపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలాంటి వ్యాఖ్యలు చేసిన హరీష్ రావుకు మద్దతుగా ఉపాధ్యాయులు హర్షధ్వానాలతో మద్దతు తెలిపారని, ఇది ప్రజాస్వామ్యంలో సరైంది కాదని ఆయన అన్నారు. తాము తలుచుకుంటే లక్షలాది మంది విద్యార్థులతో తెరాస కార్యాలయం తెలంగాణ భవన్‌ను పునాదులు కదలిస్తామని ఆయన హెచ్చరించారు. కాగా, సమైక్యాంధ్రను డిమాండ్ చేస్తూ, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు విశాఖపట్నంలో చెవిలో పూవులు పెట్టుకుని ప్రదర్శన నిర్వహించారు.

English summary
United Andhra JAC expressed angry at TRS MLA Harish rao for making comment against Maa Telugu Talli song.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X