హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కించపరిస్తే వైయస్ జగన్‌ను సహించం: దానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Danam Nagender
హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి ఏమాత్రం సంబంధం లేని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ తమ పార్టీ నేతలను కించపరిస్తే సహించబోమని మంత్రి దానం నాగేందర్‌ హెచ్చరించారు. కాంగ్రెస్‌లో ఉంటూ జగన్‌కు అనుకూలంగా వ్యవహరించే వారిపై అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. మంత్రివర్గ ఉపసంఘంలో తెలంగాణ మంత్రులకు అన్యాయం జరిగిందని పలు ఛానళ్లు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

ప్రతి సమావేశంలోనూ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకే తాము ప్రాధాన్యం ఇచ్చామని, వాస్తవాలు మరచి అనవసర విమర్శలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ఎస్సై రాత పరీక్షలోగా 14ఎఫ్‌ తొలగిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 14ఎఫ్ తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. అత్యవసర సేవలుగా ప్రకటించిన శాఖల్లో ఉద్యోగులు సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగం తప్పదని ఆయన అన్నారు. ప్రత్యేకమైన ఎజెండాతో ఉద్యోగులు చర్చలకు వస్తారని ఆయన అన్నారు.

సబ్ కమిటీకి ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారనే విమర్శను ఆయన ఖండించారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించే ఈ సబ్ కమిటీకి ఎవరూ నాయకత్వం వహించడం లేదని ఆయన అన్నారు. రాజీనామాలు చేయని తెలంగాణ ప్రజాప్రతినిధులు పాండవులని ఆయన అన్నారు. దానం నాగేందర్ ప్రకటనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణకు చెందిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. త్వరలోనే దానం నాగేందర్ తెలంగాణవాదిగా మారుతారని ఆయన అన్నారు.

English summary
Minister Danam Nagender warned YS Jaganmohan Reddy for insulting Congress leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X