కువైట్‌లో ముగ్గురు తెలుగువారి కాల్చివేత

దుర్మార్గానికి పాల్పడిన అంతర్గత వ్యవహారాల శాఖ అధికారి హైటమ్ అల్ - హజేరిని అరెస్టు చేశారు. అతని మానసిక స్థితి బాగా లేదని అంటున్నారు. మృతుల్లో నరేష్ కుమార్ కడప జిల్లాలోని నాగువారివాండ్లపల్లె గ్రామానికి చెందినవాడు. రామణయ్య చిత్తూరు జిల్లా అగ్గివారిపల్లెకు చెందినవాడు. నరేష్ రెండేళ్ల క్రితం కువైట్ వెళ్లాడు. అతనికి భార్య నాగలక్ష్మి, ఒకటిన్నరేళ్ల కుమారుడు ఉన్నారు. రమణయ్య ఉద్యోగం కోసం ఏడాది క్రితం కువైట్ వెళ్లాడు. అతని భార్య నాగేశ్వరమ్మ కువైట్‌లో కూలీగా పనిచేస్తోంది. వారికి ముగ్గురు పిల్లలు. ఇఫ్తార్‌కు రెండు నిమిషాల ముందు భోజనాలు చేసినందుకు నరేష్, ఓబుల్ రెడ్డిలను కాల్చి చంపినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications