రోశయ్యను టార్గెట్ చేసిన టి - కాంగ్రెసు నేతలు

తెలంగాణ ఉద్యమంలో భాగంగా 600 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడానికి ప్రధాన కారణంగా మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్యే కారణమని కాంగ్రెసు తెలంగాణ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానంపై రోశయ్య చేసిన వ్యాఖ్యల్ని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పుబట్టారు. ఆనాడు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాన్ని బేఖాతరు చేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో కుమ్ముకై తెలంగాణపై కుట్రలు పన్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications