జెఎసిలకు తెలంగాణ కాంగ్రెసు నేతలు దూరం

తెలంగాణ ఉద్యోగుల సమ్మెను అణచేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం అవివేకమని కేశవ రావు అన్నారు. తమ స్టీరింగ్ కమిటీ నిర్ణయాలనే మీడియా అధికారిక ప్రకటనలుగా ప్రసారం, ప్రచురణ చేయాలని ఆయన సూచించారు. తాము స్టీరింగ్ కమిటీ నిర్ణయాలకు కట్టుబడి పని చేస్తామని తెలంగాణ కాంగ్రెసు నాయకులు స్పష్టం చేశారు. స్టీరింగ్ కమిటీ నిర్ణయం మేరకు ఎవరు కూడా విధులకు హాజరు కావడం లేదని వారు చెప్పారు. 14ఎఫ్ తొలగించిన తర్వాతనే ఎస్సై రాతపరీక్షలు నిర్వహించాలని కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేశవరావు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications