నెట్ దుర్వినియోగంలో భారత్ నెంబర్ వన్!

మన దేశంలో 59 శాతం మంది, సింగపూర్‌లో 53 శాతం మంది, మధ్య ప్రాచ్య దేశాల్లో 37 శాతం మంది ఆఫీసు పనుల్లో వ్యక్తిగత పనుల కోసం అంతర్జాలాన్ని ఉపయోగిస్తున్నారంట. అయితే ప్రధానంగా వారు షేర్ల వ్యాపారం కోసం, ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఉపయోగిస్తున్నారంట. వారానికి పన్నెండు గంటల నుండి పద్నాలుగు గంటల వరకు షేర్ల వ్యాపారం కోసం ఉపయోగిస్తున్నామని 32 శాతం మంది చెప్పగా, 11 గంటల వరకు ఆన్‌లైన్ వ్యాపారం చేస్తున్నామని చెప్పిన వారు 29 శాతం మంది ఉన్నారట. ఆ తర్వాత సోషల్ నెట్ వర్కింగ్ కోసం ఉపయోగిస్తున్నారంట.
అయితే ఉద్యోగుల ఇంటర్నెట్ వాడకంపై నిఘా పెడతామని సింగపూర్ మేనేజర్లు 77 శాతం, మద్య ప్రాఛ్య దేశాల్లో 49 శాతం మంది, భారత్‌లో 62 శాతం మంది చెప్పడం విశేషం. మధ్య ప్రాచ్య దేశాల కన్నా మన దేశంలో చాలా నిఘా ఉన్నప్పటికీ ఇంటర్నెట్‌ను వ్యక్తిగత పనుల కోసం వాడటం ఎక్కువగానే ఉందన్నమాట.












Click it and Unblock the Notifications