వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సకల జనుల సమ్మె యథాతథం: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: సకల జనుల సమ్మె యథాతథంగా కొనసాగుతుందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గురువారం రాజకీయ జెఏసి సమావేశం తర్వాత అన్నారు. అయితే సమ్మెలో చిన్న మార్పు మాత్రమే ఉంటుందన్నారు. గతంలో సమ్మెను రెండు దశలుగా చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ ప్రస్తుతం మూడు దశలుగా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సకల జనుల సమ్మెను రెండు దశలుగా చేయనున్నట్లు చెప్పారు. 17న హైదరాబాదులో జరిగే మహాధర్నాతో సమ్మె ప్రారంభమవుతుందని అన్నారు. ఆ తర్వాత వచ్చే నెల 6వ తారీఖు నుండి ఉద్యమం ఉధృతంగా మారుతుందన్నారు. ఉద్యమం ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణలోని అందరూ ఉద్యమంలో పాల్గొంటారని అన్నారు.

5న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని అన్నారు. సమ్మెకు పట్నం నుంచి పల్లెదాకా అందరూ మద్దతు ప్రకటిస్తారని అన్నారు. వచ్చే నెల 6వ తేది నుండి ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాలు పాల్గొంటాయన్నారు. ప్రభుత్వం ఎస్సై పరీక్షలు వాయిదా వేయాలని అన్నారు. విద్యార్థి సంఘాలతో మాట్లాడిన తర్వాత ఎస్సై పరీక్షలపై తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. ఎవరికీ ఇబ్బందులు కలగని రీతిలో ఉద్యమం ఉంటుందన్నారు. తెలంగాణవ్యాప్తంగా తిరిగి ప్రజలను చైతన్యం చేస్తామని అన్నారు. సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకులదే అని బిజెపి సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర రావు అన్నారు. కాంగ్రెసు పార్టీ నేతలు సమ్మెలో పాల్గొనటం అనుమానమే అన్నారు. సమ్మె తర్వాత అసెంబ్లీ ఉండదన్నారు. తెలంగాణ శాసనసభ ఉంటుందన్నారు.

English summary
Telangana political JAC chairman Kodandaram confirms today that Sakala Janula Samme will conitnue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X