ఏడో అంతస్థు ఫ్లాట్ నుంచి దూకి లేడీ టెక్కీ ఆత్మహత్య

Gurgaon
న్యూఢిల్లీ: అపార్టుమెంటులోని ఏడో అంతస్థు ఫ్లాట్ నుంచి దూకి23 ఏళ్ల ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. ఆమె గుర్గావ్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెను డెహ్రాడూన్‌కు చెందిన సాక్షిగా గూర్తించారు. సంఘటనా స్థలంలో ఏ విధమైన స్యూసైడ్ నోట్ లభించలేదు. మంగళవారం సాయంత్రం తమకు ఫోన్ రావడంతో సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మహిళా టెక్కీ మృతికి సంబంధించిన ఇతర వివరాలు చెప్పగలమని పోలీసులు అంటున్నారు. ద్వారకలోని అగ్రసేన్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని గుర్గావ్‌లోని కార్యాలయానికి సాక్షి వెళ్లి వస్తుండేది. ఆమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయి కలుపుగోలుగా ఉండేదని, ఎందుకు అలా చేసిందో అర్థం కావడం లేదని ఇరుగుపొరుగువారు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+