హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు అన్యాయం జరగదు: సబితా ఇంద్రారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: విద్యార్థులు ఎస్సై పరీక్షలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం అన్నారు. పరీక్షలు ప్రకటించిన తేదీలలో యధావిథిగా పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. 14ఎఫ్ పై కేంద్ర అంతిమ నిర్ణయం శుక్రవారం వచ్చే అవకాశం ఉందని ఆమె అన్నారు. పరీక్షల వల్ల హైదరాబాదు జోన్‌లో తెలంగాణ వారికి ఎలాంటి అన్యాయం జరగదని ఆమె చెప్పారు. తెలంగాణ విద్యార్థుల కోసం పరీక్షలను అడ్డుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. 14ఎఫ్ రద్దుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని రద్దు చేస్తుండటంపట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.

కాగా శనివారం జరిగే ఎస్సై పరీక్షల కోసం బిహెచ్ఇఎల్‌లో భారీగా భద్రతా దళాలను దింపుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థికి ఒక్కో పోలీసును రక్షణగా ఉంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా పరీక్షలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రేంజ్ డిఐజి ఎస్.కె.జైన్ కరీంనగర్ జిల్లాలో చెప్పారు. 8 గంటల నుండి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. పరీక్షా కేంద్రం పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు చెప్పారు.

English summary
Home Minister Sabitha Indra Reddy said today that there is no loss to Telangana students with SI exams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X