వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలీవుడ్ నటుడు షమ్మీ కపూర్ మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shammi Kapoor
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు షమ్మీ కపూర్ ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ముంబయిలోని బీచ్ కాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న షమ్మీ కపూర్ ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. ఇతను ఉదయం 5.15 నిమిషాలకు మృతిచెందారు. 1950 - 1960 సంవత్సరాలలో ఈయన హిందీ చిత్ర సీమను ఉర్రూతలూగించారు.

షమ్మీ కపూర్ 21, అక్టోబర్ 1931లో పంజాబు రాష్ట్రంలో జన్మించారు. ఇతను పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. ఇతను తండ్రి ప్రముఖ నటుడు ప్రిథ్విరాజ్ కపూర్. ఇతను బాలీవుడ్‌లో 1953లో జీవన్ జ్యోతి చిత్రంతో ఆరంగేట్రం చేశారు. ఇతను తుమ్సే నహీ దేఖా, దిల్ దేకే దేఖో, జంగిల్ తదితర చిత్రాల్లో నటించారు. ఇతను 1968లో బ్రహ్మచారి చిత్రానికి గాను ఫిలిం ఫేర్ బెస్ట్ యాక్టర్‌గా, 1982లో విధాత చిత్రానికి గాను ఫిలిం ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌ అవార్డులు అందుకున్నారు.

English summary
Bollywood actor Shammi Kapoor dead on 14, August sunday, 2011 morning. He was born 21 October 1931 in a Punjabi, Khatri family, is an Indian film actor and director. He was a prominent lead actor in Hindi cinema during the late 1950s and 1960s.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X