మంత్రులనూ వదలొద్దు!: సిబిఐకి శంకర్‌రావు లేఖ

అందరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. సాక్షాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున అందరినీ ముందుగానే అదుపులోకి తీసుకోవాలన్నారు. విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలన్నారు. సంబంధింత మంత్రులను విచారిస్తే తగిన విషయాలు బయటకు వస్తాయని లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. హైకోర్టు ఆధ్వర్యంలోనే సిబిఐ విచారణ త్వరగా పూర్తి చేసి చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ పార్టీ వీడక ముందే తాను హైకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. ఎమ్మార్ కేసులో ఏ పక్షిని వదలకుండా అన్ని పక్షులను పట్టుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications