గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరినే బలి చేయాలని చూస్తున్నారు: అంబటి రాంబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన విషయంలో కేవలం ఇద్దరు అధికారులనే బలి చేయాలని ప్రభుత్వం చూస్తుందని వైయస్సార్సీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం విమర్శించారు. హెలికాప్టర్ ప్రమాదంపై మంగళవారం మంత్రివర్గం సమావేశంలో నాటి ఏవియేషన్ కార్పోరేషన్ ఎండి బ్రహ్మానందరెడ్డి, మరో అధికారిని తప్పుపట్టిన విషయం తెలిసిందే. దీనిపై అంబటి స్పందిస్తూ కేవలం ఇద్దరు అధికారులనే బలి చేయాలని చూడటం సరికాదన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు అమీర్‌పేట భూవ్యవహారంలో క్లీన్ చిట్ ఇవ్వడం చాలా దురదృష్టకరం అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి భజన చేస్తే ఎవరికైనా క్లీన్ చిట్ ఇస్తారని ఆరోపించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భూమికి భారం అని అన్నారు. మంత్రి పదవుల కోసమే వారు సోనియా గాంధీకి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి భజన చేస్తున్నారని అన్నారు. వారికి దమ్ముంటే రాజీనామాలు చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.

English summary
YSRC party spokes person Ambati Rambabu accused government in late YS Rajasekhar Reddy's helicopter accident issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X