హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ ఆస్తులపై, ఎమ్మార్ అక్రమాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సిబిఐ ముందుస్తు కసరత్తు చేసింది. సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బుధవారం తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలతో పాటు విశాఖపట్నం నుండి అధికారులను స్థానిక అధికారులను హైదరాబాదుకు రప్పించి వారితో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం న్యూఢిల్లీ వెళ్లి అక్కడి ఉన్నతాధికారులతో మాట్లాడి వచ్చిన లక్ష్మీనారాయణ బుధవారం స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు.

బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి హైకోర్టుకు అందజేయాలని చూస్తున్నట్లుగా సమాచారం. ఎవరి నుండి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు పకడ్బందీగా ఎఫ్ఐఆర్ నమోదు ఉండేందుకు కసరత్తు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు అనంతరం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో ఉన్న జగన్ ఆస్తులు, ఎమ్మార్ ఆస్తులపై సిబిఐ అధికారులు మూకుమ్మడి దాడులు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. దిల్ కుష్ అతిథి గృహం నుంచే దర్యాఫ్తు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం.

English summary
It seems, CBI is ready to book case against YSRC party chief YS Jaganmohan Reddy today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X