హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలా చేస్తే వైయస్ జగన్ తప్పు ఒప్పుకున్నట్లే: నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం అంటే తన తప్పు ఒప్పుకున్నట్లేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బుధవారం అన్నారు. గతంలో ఏ విచారణ ఎదుర్కొనడానికైనా సిద్ధమని ప్రగల్బాలు పలికిన జగన్ ఇప్పుడు సుప్రీం కోర్టులో పిటిషన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. జగన్ ఎలాంటి అక్రమాలు చేయకుంటే హైకోర్టు తీర్పు మేరకు సిబిఐ విచారణకు సహకరించాలన్నారు. అక్రమాలు చేయకుంటే సిబిఐ విచారణకు జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

సంఘ సంస్కర్త అన్నాహజారేను అరెస్టు చేసి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని ఆయన అన్నారు. హజారేను జైలులో పెట్టడం సరికాదన్నారు. జైలులో ఉండాల్సిన వారు బయట ఉంటున్నారు. బయట ఉండాల్సిన వారు జైలులో ఉంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపై ఉద్యమిస్తున్న అన్నాహజారేకు ప్రభుత్వం వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హజారే అరెస్టును నిరసిస్తూ నారాయణ హిమయత్ నగర్ వద్ద ధర్నా నిర్వహించారు.

English summary
CPI Narayana questioned YSRC party president YS Jaganmohan Reddy today about Supreme Court petition. He challenged him to face CBI probe if he did not made any mistakes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X