హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త పార్టీ పెట్టండి: తెలంగాణ టిడిపికి టిఆర్ఎస్ సలహా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nayini Narasimha Reddy
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు కొత్త పార్టీ పెట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ శాసనసభ్యుడు నాయిని నరసింహా రెడ్డి బుధవారం టిటిడిపికి సూచించారు. కాంగ్రెసు నేతలు వెంటనే రాజీనామా డ్రామాలు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తరిమి కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెసు నేతలకు అమరవీరుల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. సకల జనుల సమ్మె తర్వాత ఇక దంచుడే అని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాత్కాలిక సిఎం అని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్రాన్ని పాలించే అర్హత కిరణ్ కోల్పోయారన్నారు. తెలంగాణపై ఇంకా కాలాయాపన చేయలేరన్నారు.

తెలంగాణ ప్రాంత మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయకుండా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమం అన్నారు. న్యాయం కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎవరి బెదిరింపులకు లొంగేది లేదని కోదండరామ్ అన్నారు. సకల జనుల సమ్మెలో ప్రజలను భాగస్వాములు చేయడానికే బుధవారం నుండి మొదటి దశ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు టిఎన్జీవో నేత స్వామిగౌడ్ చెప్పారు. వచ్చే నెల 6 నుండి సమ్మె ఉధృతం చేస్తామని అన్నారు. కాగా అంతకుముందు సకల జనులసమ్మె ప్రారంభం సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరాపార్కు వరకు తెలంగాణ జెఏసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

English summary
Telangana Rastra Samithi suggested Telangana Telugudesam party that to launch new party for fight for seperate state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X