హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎలుకను పడుతారు: సిబిఐ విచారణపై అంబటి రాంబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: కొండను తవ్వి ఎలుకను పడుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ జరుపుతున్న విచారణపై ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ కుట్ర కారణంగానే సిబిఐ విచారణ జరుగుతోందని ఆయన గురువారం ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆరోపించారు. వైయస్ జగన్ కాంగ్రెసులో ఉండి ఉంటే సిబిఐ విచారణ జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు. కాంగ్రెసులో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇస్తామని చెప్పినవాళ్లు బయటకు వచ్చిన తర్వాత సిబిఐ విచారణకు కుట్ర చేశారని ఆయన విమర్శించారు.

సిబిఐని కాంగ్రెసు బ్యూరో ఆఫ్ కాంగ్రెసు అన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్‌పై సిబిఐ విచారణను ఎందుకు అహ్వానిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ పాలన పవిత్రంగా సాగిందని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిపై అనైతిక దాడులకు దిగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌పై కక్ష గట్టిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు.

English summary
YSR Congress party leader Ambati Rambabu termed CBI searches as political conspiracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X