మధుకోడాపై పెట్టిన కేసులే వైయస్ జగన్‌పైన

హైదరాబాదులోని లోటస్‌పాండులో గల వైయస్ జగన్ నివాసంలో సోదాలు చేస్తున్నప్పుడు జగన్ సతీమణి భారతి, వైయస్సార్ అల్లుడు అనిల్ కుమార్ ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత జగన్ తల్లి వైయస్ విజయమ్మ అక్కడికి చేరుకున్నారు. వైయస్ జగన్ మాత్రం కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర సాగించారు. సిబిఐ దాడులు కుట్రలో భాగమేనని ఆయన తన ఓదార్పు యాత్ర ప్రసంగంలో విమర్శించారు. సాక్షి కార్యాలయంలో ఇందిరా టెలివిజన్‌కు చెందిన మూడు జాతీయ బ్యాంకులకు చెందిన 300 పేజీల బ్యాంకు లావాదేవీల 300 పేజీల డాక్యుమెంట్లు సిబిఐ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
బెంగళూర్‌లోని జగన్ నివాసంపై కూడా సిబిఐ అధికారులు సోదాలు చేశారు. ముంబై, కోల్‌కత్తా, హైదరాబాదు, చెన్నై, రాజ్‌కోట్, ఢిల్లీ, బెంగుళూర్‌ల్లోని పలు కార్యాలయాలపై సిబిఐ సోదాలు చేసింది. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి కార్యాలయంలో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన చెన్నై కేంద్రంగా నడుస్తున్న ఆడిటింగ్ సంస్థకు అధిపతి. విజయసాయిరెడ్డిపై సిబిఐ ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సిబిఐ అధికారులు ప్రభుత్వాధికారులు బిపి ఆచార్య, పార్థసారథి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. తాము స్వాధీనం చేసుకున్న పత్రాల జాబితాను సిబిఐ అధికారులు సిద్ధం చేశారు. రేపు (శుక్రవారం) కూడా సిబిఐ దాడులు నిర్వహించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications