లగడపాటి శ్రీధర్, జగన్ సన్నిహితుడి ఇళ్లలో సోదాలు

కూకట్‌పల్లిలోని ఇందూ ప్రాజెక్టు అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి ఇంట్లో, కార్యాలయాల్లో, హెట్రో అధినేత పార్థసారథి రెడ్డి, హెట్రో డ్రగ్స్, హెట్రో ఫార్మా, హెట్రో హెల్త్ కేర్ కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు. దాల్మియా సిమెంట్, ఇండియా సిమెంట్, పెన్నా సిమెంట్ కార్యాలయాలలో, హరీష్ కామర్షి, పివిపి వెంచర్స్, పొట్లూ వరప్రసాద్ కంపెనీ, ఆర్ఆర్ గ్లోబల్, సండూరు పవర్ ప్రాజెక్టు, స్పూమ్ సొల్యూషన్స్, జూబ్లీ మీడియా, కార్మెల్ ఏషియా, గిల్ క్రిస్ట్, సందేష్ ల్యాబ్స్, బెంగుళూరులోని విఠల్ మాల్యా రోడ్డులోని మంత్రి అపార్టుమెంట్స్ తదితర కంపెనీల కార్యాలయాల్లో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది.
సైనిక్ పురిలోని నిమ్మగడ్డ ప్రసాద్, సాక్షికి చెందిన విజయసాయిరెడ్డి, సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వివేకానందనగర్‌లో ఉంటున్న దండమూడి వీరభద్రారావు, మహేంద్ర హిల్సులోని ధనలక్ష్మి కాలనీలో ఉంటున్న బిపి ఆచార్య, వసంత్ కుమార్ తదితరుల ఇళ్లలో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని జగన్ సన్నిహితుడు కృష్ణారెడ్డి, ఆడిటర్ సాయిరెడ్డి ఇళ్లలోనూ సిబిఐ సోదాలు నిర్వహిహించింది. ఇక ఎమ్మార్ ప్రాప్టీస్ వ్యవహారంలోను సిబిఐ హైదరాబాదుతో పాటు, ఢిల్లీలోని అధికారుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications