సాక్షి విజయసాయి రెడ్డికి ప్రాణహాని: పయ్యావుల

Payyavula Keshav
హైదరాబాద్: సాక్షి వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డికి ప్రాణహాని ఉందని ఆయనకు పోలీసులు భద్రత కల్పించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ గురువారం కోరారు. జగన్‌కు సంబంధించిన అన్ని విషయాలు ఆయనకు తెలుసునని కాబట్టి ఆయనకు ప్రాణహాని ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయ సాయి రెడ్డితో పాటు సాక్షులందరికీ పోలీసులు భద్రత కల్పించాలని ఆయన కోరారు. జగన్, ఎమ్మార్ కేసుపై గత ఇరవై అయిదు రోజులుగా కొనసాగుతున్న నేపథ్యంలో జాగ్రత్త పడాల్సిన వారు ఇప్పటికే జాగ్రత్త పడి ఉంటారని కాబట్టి కొత్తగా బయటపడేది ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. గతంలో టిడిపి నేత పరిటాల రవి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరు చనిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

సిబిఐ సోదాలు కీలక సాక్ష్యాలను బయటకు తీసుకు రావడానికే అన్నారు. కోర్టు జోక్యం చేసుకున్న కారణంగా నిజాలు బయటకు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు పార్టీ జాతీయ నాయకుడు అహ్మద్ పటేల్‌ను కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ఆర్ మంత్రివర్గంలోని మంత్రులందరినీ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ మంత్రివర్గం దొంగల ముఠా అన్న ప్రతిపక్షాల ఆరోపణలను జగన్ ఇప్పుడు అంగీకరిస్తున్నారని ఆయన అన్నారు. జగన్ టాటా, బిర్లాల్లా కష్టపడి సంపాదిస్తే సంతోషించే వాళ్లమని కానీ ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా సంపాదించారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+