జగన్ ఆస్తుల కేసు, సండూర్ మాయాజాలం

YS Jagan
హైదరాబాద్: వైయస్ జగన్ పెట్టుబడుల ప్రవాహానికి ఎంచుకున్న మార్గాలను సిబిఐ తన ఎఫ్ఐఆర్‌లో వివరించింది. చాలా కంపెనీలను జగన్ సృష్టించారని, వాటి ద్వారా పెట్టుబడులను తన కంపెనీల్లోకి ప్రవహింపజేశారని ఎఫ్ఐఆర్ తెలియజేస్తోంది. కంపెనీలను పుట్టించడం, మూత వేయడం అనే ప్రక్రియ జగన్ మాయాజాలంలో అత్యంత ముఖ్యమెందిగా మారిపోయింది. ఓ సంస్థలో రూ.533 కోట్ల పెట్టుబడి పెట్టిన కంపెనీలు, ఆ సంస్థ యజమానికే చెందిన మరో కంపెనీకి కేవలం రూ.4 కోట్లకే అమ్ముడు పోయిన వైనం జగన్ విషయంలో చూస్తాం. సిబిఐ ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం సండూర్ మాయాజాలం ఇలా ఉంది -

సండూర్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ను అడ్డుపెట్టుకుని 2007-08లో జగన్‌ మాయాజాలం చేశారు. ఈ కంపెనీకి చెందిన 82 లక్షల షేర్లను రూ.675 ప్రీమియం చొప్పున విక్రయించినట్లు చూపించడానికి జగన్‌ ఐదు కంపెనీలను పుట్టించారు. జడ్‌.ఎం.ఇన్ఫోటెక్‌, నెల్‌క్యాస్ట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, ఎక్సెల్‌ ప్రోసాఫ్ట్‌ లిమిటెడ్‌, సాయి సూర్య వేర్‌హౌసింగ్‌ కంపెనీ లిమిటెడ్‌, సిగ్మా ఆక్సిజన్‌ లిమిటెడ్‌లకు 82 లక్షల షేర్లను రూ.533 కోట్లకు అమ్మినట్లు చూపించారు. ఆ తర్వాత ఆ ఐదూ జగన్‌కు సింహభాగం వాటా ఉన్న కీలాన్‌ టెక్నాలజీస్‌లో విలీనమయ్యాయి. ఇందుకోసం వాటికి చెల్లించింది కేవలం రూ.4కోట్లు. రూ.150 కోట్ల విలువ కూడా లేని సండూర్‌ కోసం జగన్‌ ఈ విధంగా కంపెనీలను పుట్టించి, మాయం చేసి రూ.797 కోట్లను సమీకరించారు.

2001లో జగన్‌ సండూర్‌ పవర్‌ కంపెనీ కొన్నారు. 2004 వరకు కంపెనీ వ్యవహారాలు బాగానే ఉన్నాయి. తండ్రి రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సండూర్‌లోకి జగన్‌ అక్రమార్జన ప్రవాహం మొదలైంది. కంపెనీ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 22.5 మెగావాట్లు. 2005 నుంచి ఉత్పత్తి మొదలైంది. అప్పటి ప్రమాణాల ప్రకారం మెగావాట్‌కు రూ.6కోట్ల చొప్పున లెక్కకట్టినా కంపెనీ విలువ రూ.150 కోట్ల లోపే. కానీ ముడుపులు స్వీకరించడానికి, అక్రమార్జనను పెట్టుబడులుగా మార్చడానికి కంపెనీ షేర్లను భారీ ప్రీమియంతో వివిధ కంపెనీలకు విక్రయించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌ రూ.650 చొప్పున 21.42 లక్షల షేర్లను రూ.140 కోట్లకు కొన్నారు.

2005 అక్టోబరు-డిసెంబరు మధ్య సండూర్‌ పవర్‌ రూ.10 విలువ ఉన్న 1,75,49,307 ఈక్విటీ షేర్లను మారిషస్‌కు చెందిన 2ఐ క్యాపిటల్‌, ప్లూరీ ఎమర్జింగ్‌ కంపెనీలకు రూ.61 ప్రీమియంతో విక్రయించింది. ఈ రకంగా రూ.124.60 కోట్లు వచ్చాయి. ఈ రెండు కంపెనీలు విదేశీ సంస్థాగత మదుపుదారుగా సెబీ వద్ద నమోదు కాలేదు. వాటికి షేర్లను విక్రయించిన కొన్నాళ్లకే మళ్లీ వాటినుంచే నామమాత్రపు ధరకు ఆ షేర్లను కొని తన పేరన జగన్‌ బదలాయించుకున్నారు. ఆ రకంగా మారిషస్‌ కంపెనీలు అదృశ్యమయ్యాయి. ఇలా వచ్చిన రూ.124.60 కోట్లను రూ.90కోట్ల బ్యాంకు రుణాలను చెల్లించడానికి సండూర్‌ పవర్‌ ఉపయోగించుకుంది.

తర్వాత కార్మెల్‌ ఆసియా హోల్డింగ్స్‌, సిలికాన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కృష్ణా పవర్‌ టెక్నాలజీస్‌, భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌ పేరుతో నాలుగు అనుబంధ కంపెనీలను పుట్టించారు. భారీ ఎత్తున ముట్టిన ముడుపులను మారిషస్‌ ద్వారా ఈ కంపెనీల్లోకి పెట్టుబడులుగా మళ్లించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+