తెరాస నేత పోచారం శ్రీనివాస రెడ్డి అరెస్టు, ఉద్రిక్తం

గృహ నిర్బంధంలో ఉన్న పోచారం శ్రీనివాస రెడ్డి తనను విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ కిరోసిన్ డబ్బా పట్టుకుని బెదిరించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి బిచ్కుంద పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోచారం శ్రీనివాస రెడ్డి అరెస్టును తెలంగాణ జెఎసి నాయకులు ఖండించారు. ఆయనను విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో బాన్సువాడలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోచారం శ్రీనివాస రెడ్డిని విడుదల చేయాలని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications