వైయస్ విజయమ్మకు టిడిపి నేత దేవేందర్ గౌడ్ ప్రశ్న

విజయమ్మ రాసిన లేఖలో ఎక్కడా వైయస్ హయాంలో అవినీతి జరగలేదని, జగన్ నిర్దోషి అని ప్రస్తావించలేదని దానిని తాము పూర్తిగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే వారి బాధంతా రాజీవ్ గాంధీ, బొత్స సత్యనారాయణ, రోశయ్య వాళ్లంతా దోపిడీ చేసినప్పుడు సిబిఐ నుంచి తప్పించినట్లుగా ఇప్పుడు మమ్మల్ని తప్పించాలని లేఖ రాసినట్లుగా కనిపిస్తోందన్నారు. జగన్‌తో పాటు కెవిపి, అహ్మద్ పటేల్, విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు, లగడపాటి శ్రీధర్ పైనా కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications