వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో విభేదించిన ఇంద్రసేనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Indra Sena Reddy
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఎమ్మార్ అక్రమాలలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు నాటి మంత్రివర్గాన్ని సైతం బాధ్యులను చేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి ఆదివారం అన్నారు. అక్రమాలకు మంత్రివర్గం సైతం బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

తెరచాటు వ్యవహారాలతో తమకు సంబంధం లేదన్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెరవెనుక వ్యవహారాలు జరుగుతుంటే మంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మార్ కేసులో 2005 నుంచి మాత్రమే విచారణ జరపాలన్న నిర్ణయం సిబిఐ విశ్వసనీయతపై చర్చకు తావిస్తోందన్నారు. ఎమ్మార్ సంస్థ పుట్టిన నాటి నుండి విచారణ జరిపించాలని ఆయన కోరారు.

English summary
BJP senior leader Botsa Satayanarayana Reddy condemned PCC chief Botsa Satyanarayana statement on YS Jagan properties and EMAAR case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X