వైయస్ జగన్ ఐటి చెల్లింపులపై సిబిఐ ఆరా

తాజాగా సిబిఐ వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌కు, కార్మైల్ ఏషియాకు నోటీసులు జారీ చేసింది. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను, హార్డ్ డిస్క్‌లను మరో వైపు దిల్‌కుషా అతిథి గృహంలో సిబిఐ అధికారులు పరిశీలిస్తున్నారు. బెంగుళూర్‌లోని సంస్థల చైర్మెన్‌కు, సిఇవోలకు ఐటి శాఖ నోటీసులు జారీ చేసింది. వారి నుంచి బ్యాంక్ బ్యాలెన్స్‌లు తెప్పించుకుంటోంది. ప్రభుత్వ శాఖల నుంచి కూడా ముఖ్యమైన దస్తావేజులను సిబిఐ అధికారులు తెప్పించుకుంటున్నారు. బుధవారం సిబిఐ కోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి కూడా సిబిఐ నివేదికలు తెప్పించుకుంటోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు వ్యవహరంలో కూడా పూర్తి పరిశీలన జరుపుతోంది.












Click it and Unblock the Notifications