అన్నా ఎఫెక్ట్, ప్రధాని నుంచి పట్టాకు ఐఐటి విద్యార్థి నో

శశి శేఖర్ అనే సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రధాని మన్మోహన్ చేతుల మీదుగా ఎంటెక్ పట్టాను స్వీకరించబోనని ప్రకటించాడు. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లుకు అంగీకరించకపోవడం వల్లనే తాను ప్రధాని చేతుల మీదుగా పట్టా తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఆ విద్యార్థి చెప్పాడు. జన్ లోక్‌పాల్ బిల్లును సమర్థించేవారి చేతుల మీదుగా పట్టాను తీసుకుంటానని అతను చెప్పాడు.
చంద్ర కుమార్ పటేల్ అనే ఎలక్ట్రానిక్స్ ఎంటెక్ విద్యార్థి స్నాతకోత్సవంలో అన్నా హజారే ధరించినటువంటి గాంధీ టోపీ ధరిస్తానని చెప్పాడు. సంప్రదాయబద్దమైన స్నాతకోత్సవ టోపీని కాదని తాను ఆ టోపీని ధరిస్తానని అతను చెప్పాడు. హజారేకు మద్దతుగా ఖరగ్‌పూర్ ఐఐటి విద్యార్థుల కొందరు దీక్ష కూడా చేస్తున్నారు.












Click it and Unblock the Notifications