వైయస్ జగన్ ప్యాలెస్ పేద ప్రజలకు చూపిస్తా: విహెచ్

తాను బస్సులు వేసి పేదలకు జగన్ ప్యాలెస్‌లు చూపిస్తానని, చూడడానికి వచ్చిన ఒక్కో వ్యక్తికి పది రూపాయల చొప్పున చెల్లిస్తామని ఆయన అన్నారు. జగన్ ఏ విధంగా వ్యాపారం చేసి అంతగా సంపాదించాడో పేద ప్రజలకు తెలియాలి కదా అని ఆయన అన్నారు. ఐదేళ్లలో జగన్ అంతులేకుండా సంపాదించారని, వైయస్సార్ ముఖ్యమంత్రి కాక ముందు వైయస్ జగన్ వ్యాపారాలు ఏమిటి, ఆ తర్వాత ఏమిటనేది తేలాలని ఆయన అన్నారు. ఐదేళ్లో ఎలా వ్యాపారం చేసి సంపాదించాడో కూడా తెలియాలని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన స్వేచ్ఛను వాడుకుని వైయస్సార్ తన మనుషులకు పనులు చేసి పెట్టాడని ఆయన అన్నారు.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో కలిసి వైయస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ కంపెనీలన్నీ బోగసేనని ఆయన ఆరోపించారు. జగన్ ప్యాలెస్‌ల గురించి ప్రస్తావిస్తూ కొత్త తరహా భూస్వాములను తాము ఇప్పుడు చూస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications