హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మార్ కేసు, అంబటి రాంబాబూ ఇరుక్కుంటారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: ఎపిఐఐసి - ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేకపోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి) మాజీ చైర్మన్ అంబటి రాంబాబు సంతోషించే ఉంటారు. అయితే, ఆయన ఈ కేసులో ఇరుక్కునే పరిస్థితులే ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఆయన చైర్మన్‌గా ఉన్నప్పుడే ఐపిఐఐసి, ఎమ్మార్ మధ్య ఒప్పందం కుదరడం ఒకటి కాగా, ఆయన సోదరుడు అంబటి మురళీ కృష్ణ కారు చౌకగా ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఓ విల్లాను కొనుగోలు చేశాడు.

ఎమ్మార్ నివేదిక ప్రకారం - మురళీకృష్ణ చదరవు గజానికి కేవలం ఐదు వేల రూపాయలచొప్పున 1,113 చదరపు గజాల స్థలం పొందాడు. నిజానికి దాని మార్కెట్ విలువ చదరపు గజానికి 40 వేల రూపాయలకు పైగానే ఉంటుంది. అయితే ఈ విషయం తనకేమీ తెలియదని అంబటి రాంబాబు అంటున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. ఆ ఒప్పందం 2009 మార్చి 30వ తేదీననే జరిగిందని ఆయన చెబుతున్నారట. చాలా మంది పెద్దలు ఎమ్మార్‌లో చౌక ధరలకు స్థలాలు పొందినట్లు ఆరోపణలున్నాయి.

English summary
Former Andhra Pradesh Industrial Infrastructure Corporation (APIIC) chairman Ambati Rambabu may be happy that his name did not figure in the first information report (FIR) registered by the Central Bureau of Investigation (CBI) in the APIIC-Emaar scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X