30 కోట్లకు జగన్ ఎమ్మెల్యేలను కొన్నాడు: బొత్స

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 30 కోట్లు పెట్టి శానససభ్యులను కొన్నారని, డబ్బులకు అమ్ముడుపోయినవారు మళ్లీ ఎన్నికల్లో గెలువలేరని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. వైయస్ జగన్‌పై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. కోట్లు పెట్టి శాసనసభ్యులను కొనాలని వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ వర్గం శాసనసభ్యుల రాజీనామాలు ఆమోదం పొందుతాయని, ఉప ఎన్నికలకు తాము సమాయత్తమవుతున్నామని ఆయన అన్నారు. వైయస్ జగన్ వెంట నడుస్తూ రాజీనామాలు చేసినవారిని బతిమిలాడాల్సిన అవసరం తమ పార్టీకి లేదని ఆయన అన్నారు.

ఉప ఎన్నికల్లో జగన్ వర్గం శానసభ్యులు విజయం సాధించలేరని, ఒక్కరు గెలిచినా అవినీతికి లైసెన్సు ఇచ్చినట్లేనని ఆయన అన్నారు. అవినీతే ఉప ఎన్నికల్లో తమ ఎజెండా అని ఆయన చెప్పారు. ఆరోపణలు వస్తే నిజాయితీని నిరూపించుకోవాల్సిన వైయస్ జగన్ స్టే కోరుతూ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారో తెలియదని ఆయన అన్నారు. ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని వైయస్ జగన్ చూస్తున్నారని, అధికార కాంక్షే జగన్ ఎజెండా అని ఆయన విరుచుకుపడ్డారు. జగన్‌ను వెనకేసుకొచ్చిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆయన వెంటే తిరగాలని బొత్స సత్యనారాయణ అన్నారు. తనపై ఆరోపణలు వస్తే దర్యాప్తు చేయించుకున్నానని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆ దమ్ముందా అని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+