జయలలితతో కయ్యానికి వెళ్లడం లేదు: రోశయ్య

సెప్టెంబర్ 2వ తేదీన రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే తాను జన్మించానని రోశయ్య అన్నారు. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు.
తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన రోశయ్యను తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి అభినందించారు. ఆయన రోశయ్య నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాక ముందు నుంచి తనకు రోశయ్యతో సాన్నిహిత్యం ఉందని, రోశయ్య మంచి వ్యక్తి అని ఆయన అన్నారు. చిరంజీవితో పాటు పలువురు రోశయ్యను అభినందించారు.












Click it and Unblock the Notifications