వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు వైయస్‌కు రామోజీరావు ఈనాడు మద్దతు!: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: అవినీతి మీడియా రాసే వార్తలకు తాను సమాధానం చెప్పవలసిన అవసరం లేదని వైయస్సార్సీ పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. తనకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎలాంటి ఆస్తులు లేవన్నారు. రామోజీ రావుకు చెందిన ఈనాడు నాకు ఏనాడూ అనుకూలంగా వార్తలు రాయలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు వైయస్‌కే అనుకూలంగా వార్తలు రాసింది. మీడియాలో సంస్కరణలు రావాలన్నారు. రాజకీయ నేతలు మీడియాలోకి రావడం వల్లనే రాష్ట్రంలో సమస్యలు తలెత్తాయన్నారు.

భారతీయ జనతా పార్టీ నిస్సిగ్గుకా జగన్‌కు మద్దతు పలుకుతోందని ధ్వజమెత్తారు. జగన్‌కు అడుగడుగునా బరితెగించి మద్దతు పలుకుతోందన్నారు. అవినీతిపరులకు మద్దతు పలుకుతున్నందునే బిజెపి ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. అవినీతికి ఎవరూ వ్యతిరేకంగా పోరాటం చేసినా టిడిపి మద్దతిస్తుందన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి అన్నాహజారే నాంది పలికారన్నారు. అన్నా దీక్షతో పాక్షిక విజయం సాధించామని దీనిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. అన్నా దీక్షపై కేంద్ర ప్రభుత్వం దిగి రావడం ప్రజల విజయం అన్నారు. అవినీతి వల్ల రాజకీయాలు అంటే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. కోర్టులు, లోకాయుక్తలపై ప్రజలకు విశ్వాసం కలుగుతోందన్నారు.

బిజెపి, కాంగ్రెసు పార్టీలు కలిసి అన్నా దీక్షను నీరుగార్చే ప్రయత్నాలు చేశాయని ఆరోపించారు. అందుకే అవి ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించే పరిస్థితి లేదన్నారు. రాజకీయలపై విద్యార్థులకు సదుద్దేశ్యం లేదన్నారు. రాజకీయ వ్యవహారాలపై ఎన్నికల సంఘం సైతం నామమాత్రంగా వ్యవహరిస్తోందన్నారు. అసెంబ్లీ దగ్గర మీడియా పాయింటు ఎత్తేయడం సరికాదన్నారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu said today that Ramoji Rao's Eenadu supported late YS Rajasekhar Reddy at the time his Padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X