వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముసుగు దొంగలు: జగన్ వర్గం ఎమ్మెల్యేలపై బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
కాకినాడ: అవినీతిని రూపుమాపడానికి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే అందుకు భిన్నంగా వైయస్సార్ కాంగ్రెస్‌ నేతలు పూర్తిగా అవినీతికి గేట్లు ఎత్తేశారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రెండురోజుల పర్యటన నిమిత్తం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన ఆయన ఆదివారం తుని, అన్నవరం, కత్తిపూడి, చేబ్రోలు, గొల్లప్రోలు, పిఠాపురం, కాకినాడ ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో చైతన్య రథంపై నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్‌ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఇటీవల వెలుగుచూస్తున్న పరిణామాలే రుజువు చేశాయన్నారు. వీటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు కూడా సీబీఐని కోరిందంటే జగన్‌ అవినీతి ఏస్థాయికి చేరుకుందో అర్థమవుతుందని బొత్స ఆయన అన్నారు.

సీబీఐ దాడులకు నిరసనగా జగన్‌వర్గ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోపక్క ప్రభుత్వానికి కూలగొట్టడానికి వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఎరగా చూపిస్తూ ఫోన్లు చేస్తున్నారంటే ఎంత నీచస్థాయికి దిగజారుతున్నారో ఊహించుకోవచ్చని ఆయన ఆరోపించారు. ఇంకా రాష్ట్రాన్ని దోచుకుంటాం, అవినీతికి లైసెన్స్‌ ఇవ్వండన్నట్టుగా వైయస్సార్ కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే ముసుగు దొంగల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరని బొత్స అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకలాపాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమించాయన్నారు.

English summary
PCC President Botsa Satyanarayana attacked YS Jagan and his camp MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X