జగన్‌పై దూకుడు పెంచిన బొత్స సత్యనారాయణ

సిబిఐ అత్యున్నత విచారణ సంస్థ అని వైయస్ జగన్ అన్నారని, అవినీతికి పాల్పడకపోతే వైయస్ జగన్ సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ఆయన అన్నారు. దమ్ముంటే వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని ఆయన సవాల్ చేశారు. రాజీనామాలు చేసిన శానససభ్యులు వైయస్ జగన్ చుట్టు మాత్రమే చూస్తున్నారని, ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యుల రాజీనామాల ఆమోదం రెండు నిమిషాల పని ఆయన అన్నారు.
మోహన్ కందా కమిటీ నివేదిక సిఫార్సుల మేరకు ప్రభుత్వం క్రాప్ హాలిడేపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని, ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications