వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు కౌంటర్: వైయస్ వివేకానంద పాదయాత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
కడప: అబ్బాయ్ వైయస్ జగన్ తాను దరికి చేరినా పట్టించుకోకపోవడంతో కాంగ్రెసులోనే తన భవిష్యత్తును వెతుక్కోవడానికి మాజీ మంత్రి, వైయస్సార్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. జగన్‌ను ఎదుర్కోవడానికి తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఆయన యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. సోమవారం రాత్రి పులివెందులలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన తీరు, ఆయన చేపట్టబోయే కార్యక్రమం ఆ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి పేరును సిబిఐ ఎఫ్ఐఆర్‌లో చేర్చడాన్ని తప్పు పడుతూనే ఆయన వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. జగన్‌పై సిబిఐ దర్యాప్తుపై కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడానికి వైయస్ జగన్‌ను ఎదుర్కోక తప్పదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం ఆయన వర్ధంతి సందర్భంగా 40 కిలోమీటర్ల పాదయాత్ర సాగిస్తున్నట్లు మాజీ ఆయన చెప్పారు. దివంగత నేత వైఎస్ వర్ధ్దంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 2న మున్సిపాలిటీ పరిధిలోని చిన్న రంగాపురం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహావిష్కరణ చేస్తామన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పులివెందుల, వేముల, వేంపల్లెల మీదుగా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్దకు పాదయాత్ర సాగిస్తున్నామన్నారు. అక్కడ ఆయనకు నివాళులు అర్పిస్తామన్నారు. అనునిత్యం రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన వైఎస్ అడుగుజాడల్లోనే తాను నడుస్తానన్నారు. ఆయన రెండో సారి కూడా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఎంతో కృషి చేశారన్నారు.

వైఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలన్నీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ఇటీవల కాలంలో కొంత మంది వైఎస్‌నే ముద్దాయిగా చిత్రీకరించే కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. సీబీఐ విచారణలో వైయస్ పేరు ప్రస్తావించడం చాలా బాధాకరం అన్నారు. తాము అవినీతికి ఎప్పటికీ ఆమడదూరంలో ఉంటామన్నారు. మంచి పాలన ఇచ్చేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, పలు ప్రాజెక్టులు రాష్ట్రానికి తెచ్చే ప్రయత్నంలో భూకేటాయింపులు, వారిని ఆకర్షించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం ప్రధానమైందన్నారు.

సాగు నీటి ప్రాజెక్టులు నిర్మిస్తూ మరింత భూమిని సాగులోకి తెచ్చేందుకు వైయస్ ప్రయత్నాలు చేశారన్నారు. పలు పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చేందుకు భూ కేటాయింపులు, రాయితీలు ఇవ్వడం ద్వారా మరిన్ని పరిశ్రమలు రాష్ట్రంలోకి తెచ్చేందుకు వీలు అవుతుందన్నారు. ఇలా ప్రోత్సహిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని వైఎస్ ఆనాడు భావించారన్నారు. ఇవన్నీ కలుపుకుని వైయస్‌నే ముద్దాయిగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పులివెందుల ప్రజలకు మద్దతుగా వైయస్ వర్ధంతిని పురస్కరించుకుని 40 కిలో మీటర్లు పాదయాత్ర చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు.

English summary
Former minister and YSR brother YS vivekananda Reddy to takup padayatra on YSR's death anniversary day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X