తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమల మానవ కేశాల ఇ - వేలానికి నిర్ణయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: తిరుమలలో మొక్కు తీర్చుకునే భక్తుల కేశాలను ఇ -వేలం ద్వారా విక్రయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) స్పెషిఫైడ్ అథారిటీ నిర్ణయించింది. విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్‌టిసి) ద్వారా ఇ - వేలం నిర్వహించనుంది. గ్లోబల్ ఇ - వేలం వల్ల రెవెన్యూ పెరుగుతుందని టిటిడి అంచనా వేస్తోంది. విదేశీ బిడ్డర్లు కూడా వేలంలో పాల్గొనడానికి వీలవుతుంది.

ప్రస్తుతం టిటిడి 11,561 కిలోల ప్రథమ శ్రేణి 31 అంగుళాలకు మించిన పొడవున్న వెంట్రుకలకు ఇ. వేలంలో కిలోకు 12,000 రూపాయలు నిర్ణయిస్తారు. రెండో శ్రేణి 16 - 30 అంగుళాల పొడవు ఉన్న కేశాలకు కిలోకు 11 వేల రూపాయల ధర నిర్ణయిస్తున్నారు. 10 -15 అంగుళాల పొడవు ఉన్న తృతీయ శ్రేణి కేశాలకు కిలోకు 9 వేల రూపాయల ధర ఉంటుంది. ఇప్పుడు ఇ - వేలం కోసం 4 లక్షల 71 వేల 099 కిలోల కేశాలు అందుబాటులో ఉన్నాయని టిటిడి అధికారులు చెబుతున్నారు.

English summary
As decided by the Tirumala Tirupati Devastanam (TTD) Specified Authority whose term expired recently, it would take up e-auction of human hair through Metal Scrap Trading Corporation (MSTC), Vishakapatnam, a central government enterprise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X