అసెంబ్లీలో చెప్పు విసిరిన ఎమ్మెల్యే, ఏడాది సస్పెన్షన్

చెప్పు విసిరినందుకు కోట జిల్లాలోని లడ్పూరా ఎమ్మెల్యే భవానీ సింగ్ రజావత్ ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ మహిళా ఎమ్మెల్యే విసిరిన చెప్పు ఎవరికీ తాకలేదు. జీరో అవర్‌లో బిజెపి ఎమ్మెల్యే ప్రమీలా కుందర ప్రసంగానికి కాంగ్రెసు ఎమ్మెల్యే రఘు శర్మ అభ్యంతరం చెప్పడంతో రగడ ప్రారంభమైంది. చక్సులోని షీలదొంగర్లిలో కుందర 18 బీగాల జలనవరును శర్మ తన భార్య పేరు మీదికి మార్చారని కుందర ఆరోపించారు. రఘు అభ్యంతరం చెబుతూ కుందరపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యాఖ్యలకు ఆగ్రహించిన బిజెపి శాసనసభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో ఓ బిజెపి ఎమ్మెల్యే కాంగ్రెసు సభ్యుల వైపు చెప్పు విసిరారు. అది ఆఫీసర్స్ గ్యాలరీలో పడింది. ప్రతిగా రఘు శర్మ తన బూటు విసిరాడు. దాంతో గంట పాటు సభ వాయిదా పడింది.












Click it and Unblock the Notifications