వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ విషయాలు బయటకు చెప్పను: నల్లపరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nallapureddy
హైదరాబాద్: శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో తాను ఏం మాట్లాడననే విషయాలు బయటకు చెప్పబోనని తెలుగుదేశం తిరుగుబాటు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పారు. విషయం స్పీకర్ కోర్టులో ఉందని, స్పీకర్‌తో తాను చెప్పిన విషయాలను వెల్లడించడం మంచిది కాదని ఆయన అన్నారు. స్పీకర్‌తో భేటీ అనంతరం సోమవారం సాయంత్రం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. స్పీకర్ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు ఇచ్చానని, ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పీకర్ మీదే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తుండడంతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దానిపై స్పీకర్ తన ముందు హాజరు కావాలని ప్రసన్నకుమార్ రెడ్డిని ఆదేశించారు. దీంతో ఆయన సోమవారం స్పీకర్‌ను కలిశారు.

కాగా అంతకు ముందు తెలుగుదేశం పార్టీ విప్ దూళిపాళ్ల నరేంద్ర చౌదరి స్పీకర్ మనోహర్‌ను కలిశారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అంశంలో ఆయన రాజీనామాను కాకుండా తామిచ్చిన అనర్హత పిటిషన్‌పైనే చర్యలు తీసుకోవాలని టీడీఎల్పీ విప్‌ ధూళిపాళ నరేంద్ర స్పీకర్‌ను కోరారు. దొంగలు దొరల్లా తిరిగే అవకాశం ఇవ్వకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై అనర్హత వేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కోరారు.

English summary
TDP rebel MLA rejected reveal what he said with Assembly speaker Nadendla Manohar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X