విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపితో జగన్ దోస్తీ ఖరారు, ఓదార్పు మాటలతో వెల్లడి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
విజయవాడ: బిజెపితో కలిసి పనిచేయడానికి వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు. ఆయన ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన ఓదార్పు బహిరంగ సభలో మాట్లాడిన మాటలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. బతికి ఉన్నప్పుడు వ్యతిరేకించిన పార్టీలు వైయస్సార్‌ను ఇప్పుడు పార్లమెంటులో బలపరుస్తున్నాయని ఆయన అన్నారు. రాజ్యసభలో బిజెపి నేత అరుణ్ జైట్లీ, లోకసభలో సుష్మా స్వరాజ్ మాట్లాడిన తీరును ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అంటే, అటు బిజెపి జాతీయ నేతల మాటలు, ఇటు వైయస్ జగన్ తీరు ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరిన విషయాన్ని తెలియజేస్తున్నాయని అంటన్నారు.

కాగా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై జగన్ నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసం మామనే వెన్నుపోటు పొడిచారని ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఒక అబద్ధాన్ని చెప్పీ చెప్పీ దాన్ని నిజమని నమ్మించగల నేర్పరి అని ఆయన చంద్రబాబును ఎత్తిపొడిచారు. రెండెకరాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చి వేల కోట్ల రూపాయలు సపాందించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు చేస్తే అభివృద్ధి, ఇతరులు చేస్తే అవినీతా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీపైనా ఆయన విమర్శలు చేశారు. రెండు సార్లు కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తెచ్చిన వైయస్సార్‌ను కాంగ్రెసు నేతలు అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్సించారు.

English summary
It seems that YSR Congress president YS Jagan has prepared to go with BJP at National level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X