వైయస్ జగన్‌పై, ఎమ్మార్‌పై ఈడి కేసులు నమోదు

జగన్ కంపెనీలలో ఎవరెవరు ఏయే కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టారు, ఎలా పెట్టారు, అవి సక్రమంగా వచ్చిన పెట్టుబడులా, అక్రమంగా వచ్చిన పెట్టుబడులా, మూల సంస్థలు అసలువా, నకిలీవా మొదలైన అంశాలనన్నింటినీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా దర్యాప్తు చేస్తుంది. మారిషస్ నుంచి భారీగా జగన్ కంపెనీలలోకి ఊరూపేరూ లేని కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చినట్టు ప్రాథమిక సమాచారం అందిన దృష్ట్యా ఆయా కంపెనీల చరిత్రను కూడా తవ్వితీసే పనిలో దర్యాప్తు సంస్థలు ఇకముందు నిమగ్నం కానున్నాయి. మొత్తం 22 కంపెనీల నుంచి 195 కోట్ల మేరకు నిధులు అక్రమ పద్ధతిలో మళ్లింపు జరిగినట్లు సిబిఐ దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌పై కూడా ఈడి కేసు నమోదు చేసింది. ఎపిఐఐసి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బిపి ఆచార్యను ప్రథమ ముద్దాయిగా పేర్కొంటూ ఆరుగురిపై ఈడి కేసు నమోదు చేసింది.
నిధుల మళ్లింపు, ఫెమా నిబంధనల ఉల్లంఘన అలా ఉండగా హైదరాబాద్, బెంగుళూరు, కలకత్తా, ముంబై, రాజ్‌కోట్, చెన్నై వంటి నగరాల నుంచి కొన్ని కంపెనీలు జగన్ కంపెనీలలోకి పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు ఇప్పటికే సిబిఐ దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications